ఈరోజు శేరిలింగంపల్లి లోని ఆదర్శ్ నగర్ రోడ్ నం.3లో వడ్డే శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో, బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు *మారబోయిన రవి యాదవ్ గారి* సమక్షంలో బీఆర్‌ఎస్ పార్టీ చేరిక కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా పార్టీలో చేరిన నూతన సభ్యులకు పార్టీ కండువాలు కప్పి రవి యాదవ్ గారు ఆహ్వానం పలికారు. పెద్ద ఎత్తున బీఆర్‌ఎస్ పార్టీలో చేరికలు జరగడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ఈ సందర్భంగా రవి యాదవ్ గారు మాట్లాడుతూ .....ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలకు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన ప్రస్తుత ప్రభుత్వం, ఇప్పుడు ప్రజల సమస్యలను పూర్తిగా విస్మరించిందని విమర్శించారు.గత పది సంవత్సరాల కాలంలో తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రైతు భరోసా, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి వంటి అనేక సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు అపారమైన మేలు జరిగిందని గుర్తుచేశారు. కేసీఆర్ పాలన ప్రజల హృదయాలలో నిలిచిపోయిందని, అందుకే ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై విసుగు చెంది మళ్లీ బీఆర్‌ఎస్ వైపు మొగ్గుచూపుతున్నారని పేర్కొన్నారు.శేరిలింగంపల్లి ప్రజలు బీఆర్‌ఎస్ పార్టీపై విశ్వాసంతో ఎమ్మెల్యేను గెలిపిస్తే, ఆ స్థానిక ఎమ్మెల్యే పార్టీ మారి కాంగ్రెస్‌లో చేరడం ప్రజల నమ్మకానికి ద్రోహమని తీవ్రంగా విమర్శించారు. ఇంకా తాను బీఆర్‌ఎస్ వ్యక్తినే అని చెప్పడం ప్రజలను మోసం చేయడమేనని అన్నారు. దీనికి తగిన సమాధానం ప్రజలు తప్పకుండా భవిష్యత్తులో ఇస్తారని రవి యాదవ్ గారు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో బీఆర్‌ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa