ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎల్బీనగర్ పరిధిలో ఘోర ప్రమాదం, దగ్దమైన కార్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 02, 2026, 03:06 PM

హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ సాగర్ రింగ్ రోడ్డు ఫ్లైఓవర్‌ పై ఈ రోజు తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న కొందరు యువకులు మితిమీరిన వేగంతో కారును నడుపుతూ, అదుపుతప్పి ముందు వెళ్తున్న డీసీఎం వ్యాన్ ను ఢీకొట్టారు. ఈ ధాటికి కారు ఫ్లైఓవర్ డివైడర్‌ను తాకడంతో నిప్పురవ్వలు చెలరేగి కారు మొత్తం మంటల్లో చిక్కుకుంది.ప్రమాద తీవ్రతకు కారు ఇంజిన్ భాగంలో మంటలు వేగంగా వ్యాపించాయి. స్థానికులు వెంటనే అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేలోపే కారు పూర్తిగా కాలిపోయింది. అదృష్టవశాత్తూ కారులోని యువకులు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నప్పటికీ తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ఘటనతో ఫ్లైఓవర్‌పై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మద్యం మత్తులో కారును మితిమీరిన వేగంతో నడపడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమిక విచారణలో తేలింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa