ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పటాన్చెరులో ఘనంగా ఆర్యవైశ్య మహిళా విభాగం మహిళా దినోత్సవ వేడుకలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 02, 2026, 04:05 PM

పటాన్చెరు : ప్రస్తుత పోటీ ప్రపంచంలో మహిళలు అన్ని రంగాల్లో రాణించాల్సిన అవశ్యకత ఎంతైనా ఉందని పటాన్చెరు శాసన సభ్యుల గూడెం మహిపాల్ రెడ్డి సతీమణి గూడెం యాదమ్మ మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు డివిజన్ పరిధిలోని వాసవి ఫంక్షన్ హాలులో సోమవారం ఆర్యవైశ్య మహిళా విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దశాబ్దం క్రితం వరకు మహిళలు వంటిల్లుకే పరిమితమయ్యే వారిని.. నేడు అన్ని రంగాల్లో తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని నెలకొల్పారని అన్నారు. అన్ని రంగాల్లో సమాన అవకాశాలు లభిస్తున్నప్పటికిని.. వాటిని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవడం లేదని అన్నారు. సమాజంలో ఆడపిల్లల చదువుకి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు.  పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గారి సహాయ సహకారాలతో మహిళా సంక్షేమం ఆర్థిక అభ్యున్నతికి పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో గూడెం కల్పన మధుసూదన్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్ పర్సన్ హారిక విజయ్ కుమార్, మహిళా సంఘం సభ్యులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa