చిన్న పెద్ద తేడా లేకుండా సంతోషంగా రంగులు చల్లుకుంటూ జరుపుకునే వేడుక హోలీ అని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.. బుధవారం హోలీ పండుగ సందర్భంగా ఆయన ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధి చిట్కుల్ లోని ఆయన క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలు ప్రజలతో కలిసి ఆహ్లాదకర వాతావరణంలో హోలీ జరుపుకున్నారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శివుని తపస్సును భంగపరిచినందుకు కామదేవుడిని శివుడు తన త్రినేత్రంతో బూడిద చేస్తాడు, ఆ తర్వాత కామదేవుని భార్య రతి కోరిక మేరకు శివుడు కామదేవుడిని బ్రతికిస్తాడు, ఈ సంఘటనను గుర్తుచేస్తూ దేశవ్యాప్తంగా హోలీ జరుపుకుంటారని ఆయన తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa