ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ముఖ్యమంత్రికి పరిపాలన చేయడం రావడం లేదని విమర్శ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 04, 2026, 09:03 PM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐఏఎస్, ఐపీఎస్‌లను బెదిరిస్తున్నారంటూ బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు సంచలన ఆరోపణలు చేశారు. కలెక్టర్ల సదస్సులో ఆయన బెదిరింపు ధోరణిలో మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రికి పరిపాలన చేయడం రావడం లేదని విమర్శించారు. ఐఏఎస్, ఐపీఎస్‌లను పదేపదే బదిలీ చేస్తున్నారని మండిపడ్డారు.రెండున్నరేళ్లలోనే ఐదుసార్లు భారీ ఎత్తున అధికారులను బదిలీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తరచూ బదిలీలతో పాలన కుంటుపడుతోందని అన్నారు. పరిస్థితులను అర్థంచేసుకునే లోపే అధికారులను బదిలీ చేస్తున్నారని విమర్శించారు.జీహెచ్ఎంసీ కమిషనర్లు కూడా రెండున్నరేళ్లలో నలుగురు మారారని తెలిపారు. ముఖ్యమంత్రి లేదా మంత్రులకు నచ్చకపోతే ఆ అధికారులను వెంటనే బదిలీ చేస్తున్నారని ఆరోపించారు. కొందరికి పోస్టింగులు ఇచ్చి జాయిన్ చేసుకోవడం లేదని విమర్శించారు. త్వరలో కాంగ్రెస్ నేతల అవినీతిని, బినామీలను బయటపెడతామని హెచ్చరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa