ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కుటుంబ ప్రయోజన పథకానికి దరఖాస్తులు: కలెక్టర్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 05, 2026, 10:16 AM

జాతీయ కుటుంబ ప్రయోజన పథకానికి అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఒక ప్రకటనలో తెలిపారు. బిపిఎల్ కుటుంబాలలో కుటుంబాన్ని పోషించే ప్రధాన వ్యక్తి 18 నుంచి 60 సంవత్సరాల వయసు గలవారు మరణిస్తే ఈ పథకం కింద 20 వేల రూపాయల ఆర్థిక సహాయం అందుతుందని కలెక్టర్ వెల్లడించారు. అర్హులు పంచాయతీ కార్యదర్శి, ఎంపిడిఓ కార్యాలయం, తహసిల్దార్ కార్యాలయం లేదా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa