కూకట్పల్లి లోని నల్ల చెరువు ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయాలని హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు అధికారులను ఆదేశించారు. మార్చి 6వ తేదీ తర్వాత ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈ చెరువును ప్రారంభించనున్న పరిస్థితుల్లో హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు బుధవారం నల్లచెరువును సందర్శించారు. హైడ్రా మొదటివిడత చేపట్టిన 6 చెరువుల్లో ఇప్పటికెబ్బతుకమ్మ కుంటను ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. నాలుగైదు రోజుల్లో పాతబస్తీలోని బమ్రుఖనుద్దౌలా చెరువుతో పాటు కూకట్పల్లి లోని నల్ల చెరువును ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో కూకట్పల్లి నల్ల చెరువు అభివృద్ధిని పరిశీలించారు. నీడనిచ్చే మొక్కలు పెద్దమొత్తంలో నాటాలన్నారు, పార్కులు అభివృద్ధి చేయాలని సూచించారు. STP ఏర్పాటుకు సంబంధించి జలమండలి అధికారులతో మాట్లాడారు. 2024 సెప్టెంబర్ లో ఈ చెరువును అభివృద్ధి చేయడానికి హైడ్రా చర్యలు తీసుకుంటే ఎన్నో విమర్శలు చేశారు. నేడు వాళ్ళే అభినందిస్తున్నారు. ఈ చెరువు చెంత వాకింగ్, పిల్లలు ఆడుకోవడం, సేదదీరెందుకు ఐదారు కిలోమీటర్ల నుంచి వస్తున్నారు. ఇక్కడ ఇంకా అభివృద్ధి చేయాల్సి ఉంది. పిల్లల ప్లే ఏరియాతో పాటు పార్కులు, ఓపెన్ జిమ్ లు అందుబాటులోకి తెస్తామన్నారు. మొత్తం అభివృద్ధి చెందిన తర్వాత చెరువు మరింత అందంగా మారుతుందని అన్నారు. ఈ చెరువు అభివృద్ధితో వరదలు తగ్గడమే కాదు భూగర్భ జలాలు కూడా పెరుగుతాయన్నారు.