నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఉరుమడ్లకు చెందిన గుత్తా సుఖేందర్ రెడ్డి రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ నుంచి ఎంపీగా ఎన్నికై, ఆ తర్వాత కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల్లో కీలక పాత్ర పోషించారు. ఆయన మూడుసార్లు ఎంపీగా, రెండుసార్లు మండలి ఛైర్మన్‌గా సేవలందించారు. తాజాగా, ఆయన ప్రత్యక్ష రాజకీయాల నుంచి వైదొలగి, తన కుమారుడు అమిత్ రెడ్డిని రాజకీయ వారసుడిగా ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa