ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహిళా హాకీ పోరు.. ఏర్పాట్లు పూర్తి: మంత్రి శ్రీహరి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 06, 2026, 11:18 AM

అంతర్జాతీయ మహిళా హాకీ సమరానికి భాగ్యనగరం సిద్ధమైంది. ఎఫ్ఎహెచ్ ఆధ్వర్యంలో మార్చి 8 నుంచి 14 వరకు గచ్చిబౌలి స్టేడియంలో ప్రపంచ కప్ క్వాలిఫైయర్ మ్యాచ్లు జరగనున్నాయి. ఈ టోర్నీ ఆహ్వాన పత్రికను గురువారం సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డికి ముక్తల్ ఎమ్మెల్యే, మంత్రి వాకిటి శ్రీహరి, శాట్ చైర్మన్ శివసేన రెడ్డి అందజేశారు. ఇంగ్లాండ్, కొరియా, ఇటలీ వంటి జట్లు ఇప్పటికే నగరానికి చేరుకుని ప్రాక్టీస్ మొదలుపెట్టాయని పేర్కొన్నారు. ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వడం విశేషం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa