యువ ఆపదమిత్ర వాలంటీర్లుగా హైడ్రాలో శిక్షణ పొందిన మీరంతా ప్రకృతి వైపరీత్యాల సమయంలో అందుబాటులో ఉండాలని హైడ్రా అదనపు కమిషనర్, అదనపు సంచాలకులు శ్రీ ఆర్ సుదర్శన్ గారు, శ్రీ వర్ల పాపయ్యగారు సూచించారు. మీ శిక్షణ వృధా కారాదని.. ప్రతి ఒక్కరూ మరో 10 మందికి అవగాహన కల్పించి ఆపద సమయంలో సేవలందించాలని కోరారు. సంగారెడ్డి, మెదక్, హైదరాబాద్, సిద్ధిపేట జిల్లాలకు చెందిన 115 మంది యువ ఆపద మిత్ర వాలంటీర్ల శిక్షణ ముగింపు కార్యక్రమం హైడ్రా కార్యాలయంలో గురువారం జరిగింది. ఈ సందర్భంగా ఇరువురు అదికారులు మాట్లాడారు. వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు.. మీ చదువులకు అదనంగా శిక్షణ పొందారు. ఆపద సమయంలో ఆదుకునే మొదటి వ్యక్తిగా మీరుంటారని.. ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకుంటూనే సేవలందించేవారౌతారన్నారు. ప్రమాద సమయంలో సీపీఆర్ అందించడంతో పాటు.. వరదలు, అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ఎలా ప్రజలను కాపాడడమే కాకుండా.. వాటిని నియంతించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా శిక్షణ పొందారు. బాధ్యత గల పౌరులుగా సేవలందించేందుకు నిత్యం అందుబాటులో ఉండడమే కాకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. హైడ్రా కూడా మీ సేవలను వినియోగించుకోడానికి సిద్ధంగా ఉందన్నారు. సమాజ హితం అందరూ అలవర్చుకోవాలని సూచించారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి హైడ్రా ధ్రువపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ.. హైడ్రాలో శిక్షణ పొందడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. వారం రోజుల శిక్షణ మా అలవాట్లనే మార్చేసిందని.. ఎంతో చురుకుగా తయారయ్యామన్నారు. హైడ్రా ఆర్ ఎఫ్‌వో శ్రీ జయప్రకాశ్ గారు, డీఎఫ్‌వోలు శ్రీ గౌతమ్ గారు, శ్రీ యజ్ఞనారాయణ గారు, హైడ్రా ఇన్‌స్పెక్టర్ శ్రీ షంషుద్దీన్ గారు, ఏడీఎఫ్‌వో శ్రీ మోహన్‌రావుగారితో పాటు పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa