ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మండుతున్న ఎండలు.. అన్ని జిల్లాల్లో 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 07, 2026, 07:21 PM

తెలంగాణలో ఎండలు తీవ్రమవుతున్న నేపథ్యంలో, రాబోయే రెండు రోజులు రాష్ట్రంలో సాధారణం కంటే 3-4 డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. అన్ని జిల్లాల్లో 36°C-40°C మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఈ మేరకు అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. శనివారం భద్రాచలం, మహబూబ్ నగర్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో 38°C-40°C మధ్య ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa