ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సూర్య ఘర్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 09, 2026, 03:33 PM

పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ప్రజలను కోరారు. సోమవారం పెద్దపల్లి సమీకృత కలెక్టరేట్ ప్రాంగణంలో ఆయన ఈ పథకం ప్రచార రథాన్ని ప్రారంభించారు. ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా, మార్చి 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక శక్తి అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్ (టీజీ రెడ్కో) ఆధ్వర్యంలో ఈ పథకంపై ప్రజలకు అవగాహన కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa