సంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 53 కేంద్రాల్లో సోమవారం జరిగిన ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ఎలాంటి ఆటంకాలు లేకుండా ముగిశాయి. మొత్తం 19,976 మంది విద్యార్థులకు గాను 19,252 మంది (96.38%) హాజరయ్యారు. 724 మంది విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరయ్యారని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి గోవింద్ రామ్ తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ఠ నిఘా ఏర్పాటు చేయడంతో విద్యార్థులు ఇబ్బందులు లేకుండా పరీక్షలు రాశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa