పెళ్లిళ్లు, గృహప్రవేశాలు వంటి శుభకార్యాలకు ఆహ్వానం లేకుండా వచ్చి భోజనం చేసేవారిపై నిర్వాహకులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా నగరాల్లో హాస్టళ్లలో ఉండే యువకులు ఇలాంటి పనులు తరచు చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఒక ఫంక్షన్ హాల్ బయట 'సెక్షన్ 441 ప్రకారం 3 నెలలు జైలు శిక్ష, రూ. 5,000 జరిమానా' అని బోర్డు పెట్టారు. భారత శిక్షాస్మృతి (IPC) ప్రకారం సెక్షన్ 441 క్రిమినల్ ట్రెస్పాస్ను సూచిస్తుంది. అనుమతి లేకుండా ప్రైవేట్ ఆస్తిలోకి నిర్వహిస్తున్న, కార్యక్రమ ప్రదేశంలోకి ప్రవేశించడం నేరమంటున్నారు. ఈ చట్టపరమైన పరిణామాల పట్ల అప్రమత్తంగా ఉండాలని నిర్వాహకులు హెచ్చరిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa