కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లోని దుండిగల్లో గల శ్రీశ్రీశ్రీ గొల్ల కెతమ్మ బలిజ మేడలమ్మ సమేత మల్లికార్జున స్వామి దేవస్థానం ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు ఈరోజు ముఖ్యఅతిథిగా *మాజీ శాసనసభ్యులు శ్రీశైలం గౌడ్ హాజరయ్యి ఆ మల్లికార్జున స్వామివారిని దర్శించుకున్నారు.....ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆ మల్లికార్జున స్వామి ఆశీస్సులు కృపా కటాక్షాలు, ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు.అనంతరం అర్చకులు ఆలయ కమిటీ సభ్యులు శ్రీశైలం గౌడ్ గారిని శాలువాతో సత్కరించి ఆ స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో గ్రంధాలయ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ సర్పంచ్ కృష్ణ యాదవ్, జక్కుల మల్లేష్ యాదవ్, ముత్యం రెడ్డి ప్రేమ్, ఉదయ్, మరియ ఆలయ కమిటీ సభ్యులు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు భక్తులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa