ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేషన్‌కార్డుదారులకు గుడ్ న్యూస్.. అందుబాలోకి మరో డిజిటల్ సౌకర్యం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 14, 2026, 03:42 PM

రేషన్ కార్డు ఉన్న వారికి కేంద్ర ప్రభుత్వం మరో డిజిటల్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. UMANG యాప్‌లో “Mera Ration” ఫీచర్ ద్వారా ఇప్పుడు రేషన్ కార్డు వివరాలు మొబైల్‌లోనే చూసుకోవచ్చు. కుటుంబానికి నెలకు ఎంత రేషన్ కేటాయించారో, ఎంత తీసుకున్నారో సులభంగా తెలుసుకోవచ్చు. సమీపంలోని రేషన్ దుకాణాల లొకేషన్ కూడా యాప్‌లో కనిపిస్తుంది. ముఖ్యంగా వలస కూలీలకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. రేషన్ కార్డు నంబర్ లేదా ఆధార్ వివరాలతో ఈ సమాచారాన్ని చెక్ చేయవచ్చు. దీంతో కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa