మూసాపేట్ మండల్ పోల్కంపల్లి గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన "ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక" కార్యక్రమంలో భాగంగా గ్రామ పంచాయతీ సిబ్బంది సేవలను సర్పంచ్ వెంకటేశ్వరి అభినందించారు. ఉదయం నుండి రాత్రి వరకు చెత్త సేకరణ, డ్రైనేజీ శుభ్రత, నీటి సరఫరా వంటి పనుల్లో నిరంతరం శ్రమించే సిబ్బందిని గ్రామ పంచాయతీ తరపున శనివారం సన్మానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వెంకటేశ్వరితో పాటు గ్రామ పంచాయతీ కార్యదర్శి నరేందర్ గౌడ్, ఉపసర్పంచ్ మహేశ్వర్ జి, వార్డ్ సభ్యులు, ఆదర్శ యువత, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa