కోదాడ పట్టణంలో గృహ అవసరాలకు వినియోగించే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను రెస్టారెంట్, హోటల్ యజమానులు వ్యాపార అవసరాలకు వాడుకుంటున్నారు. గృహావసర సిలిండర్లకు ధర తక్కువగా ఉండటంతో వ్యాపారులు గ్యాస్ ఏజెన్సీల బాయ్ లకు రూ.100-200 అధికంగా ఇచ్చి వాటిని వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నారు. దీనివల్ల పలు ప్రాంతాల్లో గ్యాస్ బుక్ చేసిన సమయానికి అందడం లేదు. నిబంధనల ప్రకారం హోటళ్లు, దాబాలు, రెస్టారెంట్లలో కమర్షియల్ సిలిండర్లను వాడాల్సి ఉన్నా, వాటిని పట్టించుకోవడం లేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa