ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాలకు భక్తులను ఆహ్వానించిన బీఆర్ఎస్ నాయకులు మాద్రి పృథ్వీరాజ్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 23, 2026, 02:07 PM

శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని పటాన్‌చెరు పట్టణంలోని శ్రీ కోదండ సీతారామచంద్రస్వామి దేవాలయంలో ఈ నెల 25వ తేదీ నుండి 29వ తేదీ వరకు నిర్వహించనున్న వార్షిక బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారితో కలిసి బీఆర్ఎస్ నాయకులు, MDR ఫౌండేషన్ కో-ఫౌండర్ మాద్రి పృథ్వీరాజ్ గారు దేవాలయం ఆవరణలో ఆవిష్కరించారు.ఈ సందర్భంగా పృథ్వీరాజ్ గారు మాట్లాడుతూ, దశాబ్దాల చరిత్ర కలిగిన శ్రీ కోదండ సీతారామచంద్రస్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరం భక్తుల సహకారంతో వేద మంత్రోచ్చరణల మధ్య ఐదు రోజుల పాటు బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ నెల 27వ తేదీన అభిజిత్ లగ్న సుముహూర్తంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని వేలాది మంది భక్తుల సమక్షంలో ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.ఈ ఐదు రోజులపాటు జరగనున్న బ్రహ్మోత్సవాలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని మాద్రి పృథ్వీరాజ్ గారు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు శంకర్ యాదవ్, సపాన్ దేవ్, మెట్టు కుమార్ యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, అర్చక స్వామి నరసింహచార్యులు, సీనియర్ నాయకులు కుమార్ యాదవ్, అశోక్, వెంకటేష్, ఉత్సవ కమిటీ సభ్యులు మరియు ప్రముఖులు పాల్గొన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa