ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హైదరాబాద్‌కు 915 ఎలక్ట్రిక్ బస్సులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 24, 2026, 10:52 AM

TG: హైదరాబాద్ రవాణాలో కొత్త దశ ప్రారంభం. పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద హైదరాబాద్‌కు 915 ఎలక్ట్రిక్ బస్సులు మంజూరైనట్లు కేంద్రం తెలిపింది. CESL నేతృత్వంలో ఈకేఏ మొబిలిటీ-గ్రీన్ సెల్ కన్సార్టియం ద్వారా ఈ ప్రాజెక్ట్ అమలు కానుంది. నగర అవసరాలకు 100 మినీ బస్సులు, 815 12-మీటర్ల స్టాండర్డ్ ఫ్లోర్ బస్సులు అందుబాటులోకి వస్తాయి. పూర్తి ఎలక్ట్రిక్ వెహికల్స్ కావడంతో కాలుష్య ఉద్గారాలు ఉండవు. సురక్షిత, సౌకర్యవంతమైన, పర్యావరణహిత రవాణా సేవల కోసం నగర వాసులు ఈ కొత్త బస్సులను ఆస్వాదించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa