ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రామేశ్వరంబండ మల్లన్న గుట్ట జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 24, 2026, 12:59 PM

పటాన్చెరు : ఇంద్రేశం మున్సిపల్ పరిధిలోని  రామేశ్వరంబండ గ్రామ పరిధిలో గల మల్లన్న గుట్ట స్వామి దేవాలయంలో సోమవారం నిర్వహించిన స్వామివారి కల్యాణోత్సవం, జాతర మహోత్సవంలో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ధర్మకర్త, కౌన్సిలర్ అంతిరెడ్డి ఎమ్మెల్యే జిఎంఆర్ ను ఘనంగా సన్మానించారు. మల్లన్న స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa