అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలపడంతో జోగిపేటలో న్యాయవాదులు మంగళవారం సంబరాలు నిర్వహించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రారెడ్డి మాట్లాడుతూ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకువచ్చినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు నారాయణరెడ్డి, జహంగీర్ రెడ్డి, కృష్ణారెడ్డి, జగన్ పాల్గొన్నారు. ఈ చట్టం న్యాయవాదుల భద్రతకు భరోసా కల్పిస్తుందని వారు అభిప్రాయపడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa