అసెంబ్లీ బయట బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని కలిసిన దివ్యాంగులు .కాంగ్రెస్ ప్రభుత్వం దివ్యాంగులను మోసం చేసిందని కేటీఆర్ గారికి వినతిపత్రం అందజేత . రేపు ఇందిరాపార్కు వద్ద దివ్యాంగుల నిరసన దీక్షకు బీఆర్ఎస్ పార్టీ పూర్తి మద్దతు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్. కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. దివ్యాంగులు కూడా రోడ్డుపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. దివ్యాంగులకు ఎన్నికలకు ముందు ఏదైతే హామీలు ఇచ్చారో.. ఆ హామీలను ప్రభుత్వం నెరవేర్చాలి. ఎన్నికలకు ముందు దివ్యాంగులకు రూ. 6,000 పెన్షన్ ఇస్తానని రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాట తప్పింది. బీఆర్ఎస్ హయాంలో దివ్యాంగుల సంక్షేమ కోసం ఎంతో కృషి చేశాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక దివ్యాంగుల సంక్షేమం గంగలో కలిసిపోయింది. దివ్యాంగులు నానా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఏర్పడింది. నెల నెలా వచ్చే పెన్షన్ కూడా సరైన సమయానికి దివ్యాంగులకు అందడం లేదు. ఈ అసమర్ధ కాంగ్రెస్ ప్రభుత్వ ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు పోరాడుతాం. శాసనసభలో దివ్యాంగుల సమస్యలపై ప్రస్తావిస్తాం. రేపు దివ్యాంగులు చేపట్టే నిరసన దీక్షకు బీఆర్ఎస్ పార్టీ పూర్తి మద్దతు ఉంటుంది. దివ్యాంగుల పక్షాన బీఆర్ఎస్ పోరాడుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa