ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారీగా పెరగనున్న ఏసీల ధరలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 26, 2026, 11:18 AM

వేసవి నేపథ్యంలో ఏసీలకు భారీగా డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో ACల ధరలు 8% నుంచి 12% వరకు పెరగనున్నాయి. జనవరి నుంచి అమల్లోకి వచ్చిన కొత్త బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ(BEE) ఎనర్జీ రేటింగ్ నిబంధనల వల్ల తయారీ ఖర్చు పెరిగింది. అలాగే అంతర్జాతీయ మార్కెట్‌లో కాపర్, అల్యూమినియం వంటి ముడి పదార్థాల ధరలు పెరగడం, డాలర్‌తో పోలిస్తే రూపాయి బలహీనపడటం కంపెనీలపై భారాన్ని పెంచుతున్నట్లు చెబుతున్నారు. ఈ అదనపు వ్యయాన్ని తగ్గించుకోవడానికి ప్రముఖ బ్రాండ్లు ధరలను పెంచుతున్నాయంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa