పటాన్చెరు : శ్రీరామనవమి పర్వదినం పురస్కరించుకొని పటాన్చెరు డివిజన్ పరిధిలోని ప్రఖ్యాత శ్రీ కోదండ సీతారామచంద్రస్వామి ఆలయంలో నిర్వహించనున్న కళ్యాణ మహోత్సవం పురస్కరించుకొని పటాన్చెరు శాసన సభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి యాదమ్మ దంపతులు స్వామి వారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. శుక్రవారం ఉదయం భాజా భజంత్రీలు, ఉత్సవ కమిటీ సభ్యులు, కుటుంబ సభ్యులతో కలిసి తమ నివాసం నుండి రామాలయం వరకు భక్తి భావంతో బయలుదేరి స్వామివార్లకు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.. ఈ రోజు మధ్యాహ్నం అభిజిత్ లగ్నంలో సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించబోతున్నట్లు ఎమ్మెల్యే జి.ఎం.ఆర్ తెలిపారు.పటాన్చెరు నియోజకవర్గ ప్రజలందరికీ శ్రీరామనవమి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో గూడెం కల్పన మధుసూదన్ రెడ్డి, గూడెం పల్లవి విక్రమ్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, అశోక్, నరసింహ చార్యులు, వెంకటేష్. ధనరాజ్ గౌడ్, రామ్మోహన్, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa