ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అనాథ, ఆర్థికంగా వెనుకబడిన చిన్నారులకు ఆనందాన్ని పంచిన ‘ఐడియల్ కిచెన్’ కార్యక్రమం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 30, 2026, 12:56 PM

మాధాపూర్‌లోని కాకతీయ హిల్స్ ప్రాంతంలో, బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు రవెల్ల కార్తికేయన్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన “ఐడియల్ కిచెన్ – అవుట్‌డోర్ డైనింగ్ ఇనిషియేటివ్” కార్యక్రమంలో బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు శ్రీ మరబోయిన రవి యాదవ్ గారు పాల్గొన్నారు.ఈ కార్యక్రమం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన చిన్నారులకు ఆహారం అందించడంతో పాటు స్కూల్ బ్యాగులు, పుస్తకాలు కూడా పంపిణీ చేసి, వారి ముఖాల్లో చిరునవ్వులు పూయించారు.ఈ సందర్భంగా మారబోయిన రవి యాదవ్ గారు మాట్లాడుతూ.......చిన్నారుల ఆనందమే నిజమైన ఆనందం. వారికి ఆహారం మాత్రమే కాదు, విద్య కూడా ఎంతో ముఖ్యం. సమాజంలో వెనుకబడిన పిల్లలకు అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత,” అని తెలిపారు.ఈ కార్యక్రమంలో చిన్నారులు ఆనందంగా పాల్గొని భోజనం స్వీకరించి, అందించిన బహుమతులను సంతోషంగా స్వీకరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa