ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేసీఆర్ చేసిన మోసం జీవితంలో మర్చిపోను...ఈటల రాజేందర్?

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Apr 06, 2026, 11:12 AM

నన్ను బీఆర్ఎస్ నుంచి గెంటేసి ఐదేళ్లు అవుతుందని.. అయినా ఆ పార్టీలోనే న‌న్ను అభిమానించేవాళ్లు ఎక్కువ ఉన్నార‌ని మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేంద‌ర్ (Eetela Rajendar) వ్యాఖ్యానించారు. మనందరి ఎజెండా కేసీఆర్ ను ఓడించ‌డ‌మేన‌ని.. అందుకే కాంగ్రెస్‌లో చేర‌దామ‌ని రాజగోపాల్ రెడ్డి, తుమ్మల, జూపల్లి, వివేక్ వంటి నేత‌లు త‌న‌తో అన్నార‌న్నారు. వాళ్ల‌న్న‌ట్టు చేసి ఉంటే నేను మంత్రినో, డిప్యూటీ సీఎంనో అయ్యేటోన్ని అని పేర్కొన్నారు. ఆదివారం ఆయ‌న శామీర్‌పేట‌లో మీడియాతో మాట్లాడారు. పదవుల కోసం పాకులాడే అల‌వాటు త‌న‌కు లేద‌న్నారు.నేనేంటో తెలంగాణ‌కు తెలుసు..


మేం పార్టీ మారుతున్నామనీ కొంతమంది పోస్టర్ లు వేస్తున్నారని, పార్టీలు మారడం బట్టలు మార్చినంత సులువు కాద‌న్నారు. పార్టీలు మారొద్ద‌ని నేనే చెప్పాన‌ని.. నా గురించి తెలంగాణ సమాజానికి తెలుసన్నారు. 25 ఏళ్లు ఉండ‌డంతోనే బీఆర్ఎస్‌లో అభిమానించేవాళ్లు ఎక్కువ ఉన్నార‌ని చెప్పారు. ఈటలను పొగొట్టుకుని కేసీఆర్ తప్పు చేశారని ప్రజలు అంటున్నార‌ని వివ‌రించారు. వీళ్లందరూ కేసీఆర్ తో కలుస్తారని నా దృష్టికి వ‌చ్చింద‌ని, ఇలాంటి చిల్ల‌ర ప‌నులు చేయొద్ద‌ని కోరుతున్న‌ట్లు తెలిపారు. నన్ను బర్తరఫ్ చేయడమే కాకుండా ఇబ్బందులు పెట్టారు. కోళ్ల ఫామ్‌లు కూల్చారు.. భూములు గుంజుకున్నారు. నేను లీగల్ గా కొనుక్కున్నవి చెరబట్టారు. సీఎంకు లేఖ రాస్తా. సందర్భం వస్తేనే ఈటెల రాజేందర్ అంటే ఏంటో తెలుస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa