TG: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో (RGIA) ఈరోజు ఉదయం ఒక ప్రయాణికుడి బ్యాగులో ఉన్న సెల్‌ఫోన్ బ్యాటరీ పేలడంతో కలకలం రేగింది. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ వెళ్లేందుకు సిద్ధమైన ప్రయాణికుడి బ్యాగ్‌ను భద్రతా సిబ్బంది తనిఖీ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. బ్యాటరీ పేలడంతో పొగలు రావడంతో సిబ్బంది అప్రమత్తమై, అగ్నిమాపక చర్యలు చేపట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. బ్యాటరీ నాణ్యత లోపం లేదా షార్ట్ సర్క్యూట్ కారణమై ఉండవచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఈ ఘటనతో రాయ్‌పూర్ విమానం కొద్దిసేపు ఆలస్యమైంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa