ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్థానిక సమస్యలపై పాదయాత్ర… మాజీ కార్పొరేటర్ జగన్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 17, 2026, 12:30 PM

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలో, మాజీ కార్పొరేటర్ కొలుకుల జగన్ గురువారం మగ్దూం నగర్ నుంచి బీరప్ప నగర్ వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా సీసీ రోడ్ల పనులను పరిశీలించిన ఆయనకు స్థానికులు పలు సమస్యలను వివరించారు. సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చిన జగన్, సీసీ రోడ్డు పనులను త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రికల్ ఏఈ రాధాకృష్ణరెడ్డి, వేణు యాదవ్, మోహన్ రెడ్డి, నరేష్ రాజు, సంపత్ రెడ్డి, సునీల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa