ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వీర్నపల్లిలో హిందూ సమ్మేళనం కరపత్రం ఆవిష్కరణ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 17, 2026, 01:49 PM

రాజన్న సిరిసిల్ల జిల్లా, వీర్నపల్లి మండల కేంద్రంలో హిందూ సమ్మేళనం కరపత్రాన్ని హిందు సమ్మేళన నిర్వహణ కమిటీ అధ్యక్షుడు దేవయ్య, సర్పంచ్ మల్లారపు జ్యోత్స్న, ఉప సర్పంచ్ నరేష్, ఏఎంసీ వైస్ చైర్మన్ లక్ష్మన్, కమిటీ సభ్యులు కలిసి శుక్రవారం ఆవిష్కరించారు. ఈ నెల 23న సాయంత్రం 5 గంటలకు కళ్యాణ సీతారామాంజనేయ ఆలయంలో జరగనున్న హిందూ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ దేవరాజు, వార్డు సభ్యులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa