హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ పెట్టుబడులు ఆకర్షణీయంగా ఉన్నా, చట్టపరమైన అనుమతులపై అవగాహన లేకపోతే కొనుగోలుదారులు నష్టపోయే ప్రమాదం ఉంది. అనధికారిక లేఅవుట్లు, నిర్మాణాలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ఆస్తి కొనుగోలు చేసేటప్పుడు HMDA, DTCP, GHMC వంటి సంస్థల అనుమతులను క్షుణ్ణంగా పరిశీలించాలి. వ్యవసాయ భూములను నివాస ప్లాట్లుగా మార్చడానికి HMDA అనుమతి, భవన నిర్మాణాలకు విడిగా పర్మిషన్లు తప్పనిసరి. DTCP పరిధిలో సర్వే నంబర్ల విషయంలో మోసాల పట్ల, GHMC పరిధిలో అనుమతులు లేని భవనాల విషయంలో జాగ్రత్త వహించాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa