హరిత ఉద్యమాన్ని ఓ బాధ్యతగా భావించి ఆ దిశగా లక్షలాది మంది మొక్కలు నాటేలా ప్రభావితం చేసిన రాజ్యసభ మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ కు బ్రిటన్ పార్లమెంట్ లో అరుదైన గౌరవం దక్కింది. పర్యావరణ సంరక్షణ కోసం పాటుపడిన వారి కోసం ఉద్దేశించిన ప్రతిష్టాత్మక గ్లోబల్ గ్రీన్ ఐకాన్ పురస్కారాన్ని బ్రిటన్ పార్లమెంట్ లో సంతోష్ కుమార్ కు అందజేశారు. శుక్రవారం (2026 ఏప్రిల్ 17న) హౌస్ ఆఫ్ లార్డ్స్ లో జరిగిన ప్రపంచ వాతావరణ సంరక్షకుల సదస్సు (వరల్డ్ క్లైమేట్ లీడర్స్ కాన్ క్లేవ్) లో ఆయనను ఈ అవార్డుతో సత్కరించారు. Mr నిక్ న్యూలాండ్ ఎస్నార్ వైస్ ప్రెసిడెంట్ యునెస్కో, బ్రిటిష్ పార్లమెంట్ సీనియర్ సలహాదారు డేవిడ్ తాంప్సన్, నికెల్ ఎడ్విన్ అడ్వైజర్ టు కౌంటీ కౌన్సిల్, మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ హౌస్ ఆఫ్ కామన్స్ పలువురు ముఖ్య బ్రిటిష్ అధికారులు, అంతర్జాతీయ ప్రతినిధులు ఈ కాన్ క్లేవ్ కు హాజరయ్యారు. ఈ సందర్భంగా హౌస్ ఆఫ్ లార్డ్ష్ ప్రతినిధులు .. సంతోష్ కుమార్ పై ప్రశంసల వర్షం కురిపించారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ ఉద్యమానికి కితాబునిచ్చారు. లక్షలాది మంది పర్యావరణ హిత కార్యక్రమాలు చేపట్టేలా స్ఫూర్తినిచ్చారంటూ శ్లాఘించారు.
పచ్చటి మొక్కలతోనే భవిష్యత్తంటూ..
ఇగ్నైటింగ్ మైండ్స్ అనే స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులైన సంతోష్ కుమార్ పచ్చటి మొక్కలతోనే అందమైన భవిష్యత్తు ఉంటుందని భావించారు. తెలంగాణలో హరితహారం ఇచ్చిన స్ఫూర్తితో వసుధైక కుటుంబం నినాదంతో గ్రీన్ ఇండియా చాలెంజ్ ఉద్యమం నడిపారు. ఇందులో భాగంగానే.. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు లక్షలాది మంది పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. తెలంగాణలో పలుచోట్ల చిట్టడవులు పచ్చగా కళకళలాడేలా చేయగలిగగారు.పర్యావరణ సంరక్షణలో సంతోష్ కుమార్ కృషిని గుర్తించిన వరల్డ్ క్లైమేట్ లీడర్స్ కాన్ క్లేవ్ .. గ్లోబల్ గ్రీన్ ఐకాన్ పురస్కారాన్ని అందజేసింది.
సమిష్టి కృషి వల్లే సాధ్యమైంది ...
హౌస్ ఆఫ్ లార్డ్స్ లో ఈ అరుదైన పురస్కారం దక్కినందుకు నిజంగా గర్వంగా ఉంది. ఇది నా ఒక్కడి ఘనతేనని భావించడం లేదు. మేం చేపట్టిన గ్రీన్ చాలెంజ్ ఉద్యమంలో లక్షలాది మంది పాలు పంచుకోవడం వల్లే నాకు ఈ పురస్కారం దక్కింది. తెలంగాణ సాధకుడు, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన హరితహారమే గ్రీన్ ఇండియా ఉద్యమానికి స్ఫూర్తి గా నిలిచింది. తెలంగాణకు హరిత హారం కార్యక్రమంలో 280 కోట్ల మొక్కలు నాటడం చరిత్రలోనే ఓ మైలు రాయి.పర్యావరణ సమతుల్యత కోసం చేపట్టిన ఒక గొప్ప కార్యక్రమమది.
ప్రకృతి హితం కోసం హరితహారం మాకు ఓ సంకల్పాన్ని అందించింది. అందులోనుంచే గ్రీన్ ఇండియా చాలెంజ్ పుట్టింది.ఆ ఉద్యమంలో భాగంగానే గ్రామస్థాయి నుంచి కాస్మొపాలిటన్ నగరాల వరకు లక్షలాది మంది మొక్కలు నాటారు. హరిత ధరిత్రి కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలనే భావనను గ్రీన్ ఇండియా చాలెంజ్ కలిగించింది. లక్షలాది మైండ్ సెట్ మార్చగలిగింది. ఈ పురస్కారం మరిన్ని బాధ్యతలను గుర్తు చేసింది.
భవిష్యత్ తరాలను హరిత మయం చేసే దిశగా మరిన్ని కార్యక్రమాలు చేపట్టేలా ఈ అవార్డు స్ఫూర్తినిచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa