ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరానికి అనుగుణంగా మౌలిక వసతులను కల్పిస్తాం : ఎమ్మెల్యే కెపి. వివేకానంద్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Apr 18, 2026, 02:38 PM

ఈరోజు  జీహెచ్ఎంసీ నిజాంపేట్ సర్కిల్ పరిధి బాచుపల్లి లోని నందనవనం కాలనీలో బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ గారు అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ సందర్బంగా కాలనీలో నిర్మాణంలో ఉన్న సీసీ రోడ్డు పనులను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ... వేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ నగర అభివృద్ధిలో భాగంగా శివారు ప్రాంతాలలో రోజురోజుకు పెరుగుతున్న జనాభాకు అనుకూలంగా వెలుస్తున్న కొత్త కాలనీలలో మౌలిక వసతుల కల్పనకు కృషిచేస్తున్నామని, రానున్న రోజుల్లో కాలనీని మరింత అభివృద్ధి చేసేందుకు కృషిచేస్తామన్నారు. అంతకముందు స్థానిక శ్రీ రాజ రాజేశ్వర స్వామి దేవాలయం (మరకత) అభయాంజనేయ స్వామి దేవాలయం లో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నందనవనం కాలనీ  వాసులు మోహన్, సురేష్, రాజశేఖర్, మహేష్, కిషోర్, నిజాంపేట్ మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్, మాజీ కార్పొరేటర్లు ఆగం రాజు, సుజాత, మాజీ కో-ఆప్షన్ సభ్యులు సతీష్, నాయకులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa