ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మున్నూరుకాపు భవనంలో సుదర్శన నరసింహ కళ్యాణంలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ బీర్ల అయిలయ్య

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Apr 20, 2026, 11:13 AM

యాదగిరిగుట్ట మున్నూరు కాపు సత్రం ఆధ్వర్యంలో ఘనంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణం నిర్వహించారు.108 మంది దంపతులతో సుదర్శన నరసింహ హోమం జరిగింది. అనంతరం ఒక వెయ్యి ఎనిమిది మంది దంపతులతో లక్ష్మీ నరసింహ స్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని భారీ ఎత్తున నిర్వహించారు.ఈ కళ్యాణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల అయిలయ్య గారి దంపతులు ముఖ్య అతిథిలుగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడం తనకు ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు.ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను పెంపొందించి,మన సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందించే గొప్ప వేదికలని అన్నారు.ముఖ్యంగా మున్నూరు కాపు సత్రం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో,భారీ స్థాయిలో నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు.108 మంది దంపతులతో హోమం,1008 మంది దంపతులతో కళ్యాణం నిర్వహించడం విశేషమని కొనియాడారు.ప్రజలందరికీ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆశీస్సులు లభించాలని,ప్రతి కుటుంబం సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు,నాయకులు,భక్తులు భారీగా పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa