మేషం
వృత్తి వ్యాపారాలలో భాగస్వామితో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి చేపట్టిన పనులు సమయానికి పూర్తి చేస్తారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో ఆశించిన హోదాలు పొందుతారు.ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. కొన్ని వ్యవహారాలలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి సమస్యలు పరిష్కరించుకుంటారు.
వృషభం
నూతన వస్తు వాహన లాభాలు ఉన్నాయి. ప్రముఖుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో యత్నకార్యసిద్ధి కలుగుతుంది సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ఉద్యోగాలలో ఒత్తిడులు అధిగమిస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణిస్తాయి.
మిధునం
మిత్రులతో ఊహించని మాటపట్టింపులు కలుగుతాయి. పాత రుణాలు తీర్చడానికి నూతన రుణాలు చేస్తారు. చేపట్టిన పనులలో జాప్యం తప్పదు. వృత్తి స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నవి వృత్తి వ్యాపారాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. ఉద్యోగాలలో అదనపు పని భారం వలన శ్రమాధిక్యత పెరుగుతుంది.
కర్కాటకం
వ్యాపారాలు సమర్థవంతంగా నిర్వహించలేక ఇబ్బందులు ఎదుర్కొంటారు చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఇంటా బయట ఆలోచనలు అంతగా కలిసి రావు. నూతన విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగాలలో అధికారుల నుంచి ఒత్తిడి తప్పదు. కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి.
సింహం
సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. దూరపు బంధువుల నుండి ఆసక్తికర సమాచారం అందుతుంది. సన్నిహితులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలు అభివృద్ధి బాటలో పయనిస్తాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహంతో పని చేసి ప్రశంసలు అందుకుంటారు.
కన్య
ఆధ్యాత్మిక చింతన పెరుగుతుందిబంధుమిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. చేపట్టిన పనులలో ప్రతిబంధకాలు ఉంటాయి వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహారించాలి. ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. దీర్ఘకాలిక ఋణ ఒత్తిడి పెరుగుతుంది.
తుల
వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.
వృశ్చికం
ప్రయాణాలు ఆకస్మికంగా వాయిదా పడుతాయి. బంధువులతో స్వల్ప మాటపట్టింపులుంటాయి.ఇంటా బయట పరిస్థితులు అంతగా అనుకూలించవు. వృత్తి వ్యాపారాలలో కొంత గందరగోళ పరిస్థితులుంటాయి. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి వృధా ఖర్చులు పెరుగుతాయి.
ధనస్సు
ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా చేస్తారు. చేపట్టిన పనులు చకచకా పూర్తి అవుతాయి. వృత్తి వ్యాపారాలలో నూతన వ్యూహాలతో ముందుకు సాగుతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది స్థిరస్తి వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి.
మకరం
కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. చిన్ననాటి మిత్రులతో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి.
కుంభం
కుటుంబ సభ్యులతో దైవదర్శనం చేసుకుంటారు.ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. ఒత్తిడి అధికమైన నిదానంగా పనులు పూర్తి చేస్తారు. నూతన వ్యాపార పెట్టుబడుల విషయంలో పునరాలోచన చేయడం మంచిది. ఉద్యోగాలు కొంత నిరాశ కలిగిస్తాయి రుణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది.
మీనం
ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది కుటుంబ సభ్యుల ప్రవర్తన మానసికంగా చికాకు కలిగిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు తప్పవు స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నవి దూరప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఉద్యోగాలలో సమస్యలు అధికమవుతాయి నూతన ఋణ ప్రయత్నాలు అంతగా అనుకూలించవు.