మేషం
ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగవుతుంది. ఇంటా బయట మరింత ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వ్యాపార వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. ఉద్యోగ వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది. బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానం అందుకుంటారు.
వృషభం
వృత్తి, వ్యాపారాలలో సమస్యలు తెలివిగా పరిష్కరించుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరానికి తన సహాయం లభిస్తుంది. చేపట్టిన పనుల్లో చికాకులు పెరుగుతాయి. కీలక నిర్ణయాలలో సన్నిహితుల సలహా తీసుకొని ముందుకు సాగడం మంచిది. సోదరుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు.
మిధునం
ఇంటాబయట బాధ్యతలు చికాకు పరుస్తాయి.ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో స్వల్ప మాటపట్టింపులు ఉంటాయి. వ్యాపార వ్యవహారాలలో సొంత ఆలోచనలు చేయడం మంచిది కాదు. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహకర వాతావరణం ఉంటుంది వృధా ఖర్చులు పెరుగుతాయి.
కర్కాటకం
వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు స్థిరంగా సాగవు. ముఖ్యమైన పనులలో ప్రతిబంధకాలు తప్పవు కుటుంబ సమస్యలు మరింత నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగ, ప్రయత్నాలు మందగిస్తాయి. నూతన ప్రయత్నాలు అంతగా కలిసి రావు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉంటుంది.
సింహం
కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో ఆశించిన పురోగతి లభిస్తుంది. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి.చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది.
కన్య
ఇతరులతో వివాదాలకు వెళ్లకపోవడం మంచిది. చేపట్టిన పనులు శ్రమతో కొన్ని పూర్తవుతాయి కుటుంబ సభ్యులతో ఆస్తి వివాదాలు కలుగుతాయి ఆర్థిక పరిస్థితి మరింత నిరాశ కలిగిస్తుంది. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి.
తుల
ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుంది. నూతన వాహన యోగం ఉన్నది. సన్నిహితుల నుంచి వివాదాలపై కీలక సమాచారం అందుతుంది. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగ ఈ విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ముఖ్యమైన వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి.
వృశ్చికం
ఆరోగ్యం అశ్రద్ధ చేయడం మంచిది కాదు.బంధువులతో ఊహించని విభేదాలు కలుగుతాయి ఆర్థిక పరిస్థితులు కొంత మందగిస్తాయి. వృత్తి, వ్యాపారాలు ఇబ్బంది కలిగిస్తాయి. నిరుద్యోగులు అధిక శ్రమతో అల్ప ఫలితాలు పొందుతారు. ఇంటాబయట పని ఒత్తిడి అధికమై సమయానికి నిద్రాహారాలు ఉండవు.
ధనస్సు
ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి.చేపట్టిన పనులు జాప్యం అయినప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు దైవదర్శనాలు చేసుకుంటారు వృత్తి, వ్యాపారాలలో ఆటంకాలు తొలగుతాయి. అధికారులతో చర్చలు ఫలిస్తాయి. సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి.
మకరం
నిరుద్యోగుల యత్నాలు కొలిక్కి వస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు సోదరుల నుండి అవసరానికి ధన సహాయం లభిస్తుంది. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు చిన్ననాటి మిత్రుల నుండి ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి.
కుంభం
ముఖ్యమైన వ్యవహారాలలో సొంత ఆలోచనలు చెయ్యటం మంచిది కాదు. చేపట్టిన పనులలో తొందరపాటు మంచిది కాదు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. బంధువర్గంతో విభేదాలు. దైవ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో అధికారుల నుంచి ఒత్తిడి పెరిగి విశ్రాంతి ఉండదు.
మీనం
కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి ఆర్థిక పరిస్థితి కొంత మందకొడిగా అవుతుంది. ముఖ్యమైన వ్యవహారాలలో శ్రమాధిక్యత కలుగుతుంది వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహకర వాతావరణం ఉంటుంది ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు ధన వ్యవహారాలలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి.