సింగిల్ వర్డ్ ట్వీట్. ఇపుడు ఇదే కొత్త ట్రెండ్. స్పోర్ట్స్ ప్లేయర్లు, ప్రముఖ సెలెబ్రిటీలంతా వన్ వర్డ్ ట్రెండ్‌నే ఫాలో అవుతున్నారు. ఆమ్ ట్రాక్ అనే అమెరికా రైల్వే కంపెనీ సెప్టెంబరు 1న పొరపాటున 'ట్రైన్స్' అనే ఒకే పదాన్ని ట్వీట్ చేసింది. దాంతో అదే ట్రెండ్ గా మారిపోయింది. ఆపై నాసా, వాషింగ్టన్ పోస్ట్, ప్రెసిడెంట్ జో బైడెన్, మనదేశంలో సచిన్, దినేశ్ కార్తీక్ కూడా ఈ వన్ వర్డ్ ట్రెండ్ ఫాలో అవుతున్నారు.