ఆధార్ నంబరును ఉపయోగించి బ్యాంకు బ్యాలెన్స్‌ను చెక్ చేయొచ్చు. అయితే ఇందు కోసం బ్యాంకులో రిజిస్టర్ నంబరు నుంచి *99*99*1#కి ఫోన్ కాల్ చేయాలి. ఆ తర్వాత మీ 12 అంకెల ఆధార్ నంబరును నమోదు చేయాలి. మరోసారి ధ్రువీకరణ కోసం ఆధార్ నంబరును ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ ఫోన్ నంబరుకు మీ బ్యాంకు బ్యాలెన్స్ ఎంత ఉందో మెసేజ్ వస్తుంది. ఇంటర్నెట్ లేని సమయంలో ఇలా ప్రయత్నించి బ్యాంకు బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు.