నిరుద్యోగులకు గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ (జీఎస్టీ )అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ కోర్సుల్లో ఉచిత శిక్షణ అవకాశం కల్పిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి ప్రణయ్ తెలిపారు. ఇంటర్ అర్హతతో పాటు 18 నుంచి 30 సంవత్సరాల వయసులోపు గల వారు చేబ్రోలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెండు నెలల పాటు శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు చెప్పారు. మరిన్ని వివరాలకు 9666545975 సంప్రదించాలన్నారు.