పీజీతో సంబంధం లేకుండా నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ చేసినవారు డైరెక్ట్ గా పీహెచ్‌డీలో చేరే అవకాశాన్ని యూజీసీ కల్పించనుంది. దీనిపై యూజీసీ త్వరలో గైడ్ లైన్స్ విడుదల చేయనుంది. ఇది అమల్లోకి వస్తే బీఈ, బీటెక్, ఆనర్స్ డిగ్రీ, బీ ఫార్మసీ, ఫార్మా-డీ తదితర కోర్సులు చేసిన విద్యార్థులు నేరుగా పీహెచ్‌డీలో చేరొచ్చు. అయితే విద్యార్థులు 4ఏళ్ల లేదా 8 సెమిస్టర్లున్న కోర్సులో 75% కి పైగా మార్కులు పొందాలి.