మేషం
ఇంటా బయట పని ఒత్తిడులు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమానంతరం పనులు పూర్తి అవుతాయి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు కలిసిరావు. జీవిత భాగస్వామితో వివాదాలు కలుగుతాయి. ఆదాయ మార్గాలు తగ్గుతాయి.
వృషభం
చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. స్థిరస్తి కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. నూతన వ్యాపారానికి పెట్టుబడులు అందుతాయి. బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.
మిధునం
దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. ఆర్థిక పురోగతి కలుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నూతన కార్యక్రమాలు చేపడతారు.
కర్కాటకం
అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలి. ఇంటాబయట గందరగోళ పరిస్థితులుంటాయి. వృత్తి, వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. పాత రుణాలు తీర్చడానికి నూతన రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. మిత్రులతో కలహాలు సూచనలు ఉన్నవి.
సింహం
ధన పరంగా ఇతరులకు మాట ఇవ్వటం మంచిది కాదు. మిత్రులతో దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన చికాకు కలిగిస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.
కన్య
ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు. సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. దూరపు బంధువులు కలుసుకుని పాత విషయాలు చర్చిస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి అవుతాయి.
తుల
వృత్తి, వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. గృహమున కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు విస్తృతం అవుతాయి. ఆర్థిక అనుకూలత పెరుగుతుంది. సోదరుల నుండి శుభవార్తలు అందుకుంటారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.
వృశ్చికం
దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉంటాయి. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నవి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగ విషయంలో కొంత ఒత్తిడి తప్పదు. వృథా ఖర్చులు పెరుగుతాయి.
ధనస్సు
అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు. నిరుద్యోగుల ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. కొన్ని వ్యవహారాలు శ్రమతో గాని పూర్తి కావు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి.
మకరం
విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.అధికారుల సహాయంతో పదోన్నతులు పెరుగుతాయి. చేపట్టిన పనులు చకచకా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలు అనుకూలిస్తాయి. స్థిరస్తి వివాదానికి సంబంధించి విలువైన సమాచారం అందుతుంది. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.
కుంభం
వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఆరోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. కీలక వ్యవహారాలలో స్వల్ప అవరోధాలు కలుగుతాయి. ఉద్యోగాలలో సహోద్యోగుల ప్రవర్తన మానసిక బాధను కలిగిస్తుంది వృధా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది.
మీనం
కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. దైవ సేవా కార్యక్రమాలకు ధనసహాయం అందిస్తారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. కొన్ని వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. ఆర్థికంగా పురోగతి కలుగుతుంది.