గుంటూరు విద్యా హక్కు చట్టంలో భాగంగా 2022-23 విద్యా సంవత్సరానికి ప్రైవేటు పాఠశాలలో 25% ప్రవేశాలలో భాగంగా రెండో విడతలో అర్హత పొందిన విద్యార్థుల జాబితా cse. ap. gov. in వెబ్ సైట్ లో ఉంచినట్లు డిఇఓ పి. శైలజ ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత పొందిన విద్యార్థుల ప్రవేశాలు ఈనెల 28 నుంచి అక్టోబర్ 10వ తేదీ లోగా సంబంధిత పాఠశాలలో జరుగుతాయని తెలిపారు.