అత్తిలి మండలం, ఆరవల్లి గ్రామంలో వేంచేసిన కనకదుర్గ అమ్మవారి దేవాలయం నందు దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవితంగా జరుగుతున్నాయి. మంగళవారం మహర్నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని అమ్మవారు మహిషాసురమర్దిని అవతారాన్ని ధరించారు. అమ్మవారిని దర్శించిన భక్తులు ముగ్ధులయ్యారు. ఆలయ ప్రాంగణం అంతా కూడా భవాని నామస్మరణతో మార్మోగింది. భవాని దీక్ష దారులు మరియు భక్తులు అమ్మవారిని దర్శించి తరించారు.