కుప్పం మండలం ఉర్లఓబనపపల్లి సమీపంలోని బెటరాయస్వామి కొండపై శనివారం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీనివాస కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. తమిళ సంప్రదాయం ప్రకారం పెరటాసి మాసం మూడో శనివారం ప్రతి ఏటా బెటరాయస్వామి కొండపై శ్రీనివాస కళ్యాణం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. శనివారం జరిగిన శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, ఎంపీ రెడ్డప్ప, ఎమ్మెల్సీ భరత్ లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వేదపడింతుల మంత్రోత్సరణలతో బెటరాయస్వామి కొండ మార్మొగింది. స్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించడానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.