తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని ఉన్నత విద్యా సంస్థల్లో విద్యార్థులతో పాటు టీచర్లు, సిబ్బందికి బయో మెట్రిక్ హాజరును తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. స్కాలర్ షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ కు, విద్యార్థుల హాజరు శాతాన్ని తెలుసుకునేందుకు ఇది ఉపయోగపడుతుందని, అలాగే టీచింగ్, నాన్ టీచింగ్ పని చేసే టైం తెలుస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.