నేడు ఏపీ పీజీ సెట్-2022 ఫలితాలు విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. ఉన్నత విద్యా మండలిలో సాయంత్రం 4 గంటలకు పీజీసెట్ ఫలితాలను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. అయితే.. ఈ ఫలితాలను విద్యా మండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి విడుదల చేయనున్నారు. అయితే.. ఆంధ్రప్రదేశ్ పోస్టుగ్రాడ్యుయేషన్ ప్రవేశ పరీక్షల (ఏపీపీజీసెట్)కు ఏపీలోని 13 జిల్లాలు, తెలంగాణలోని హైదరాబాదులో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. రోజూ మూడు దశల్లో జరిగే ఈ పరీక్ష ఆన్‌లైన్ విధానంలో అధికారులు కట్టుదిట్టంగా నిర్వహించారు.
ఉదయం 9.30 నుంచి 11 గంటల వరకు.. రెండో సెషన్ మధ్యాహ్నం 1 నుంచి 2.30 గంటల వరకు.. మూడో సెషన్‌లో సాయంత్రం 4.30 నుంచి 6 గంటల వరకు పరీక్షలు నిర్వహించారు. పరీక్షల నిర్వహణపై ఏపీ పీజీసెట్ ఛైర్‌పర్సన్ వైవీయూ వీసీ సూర్యకళావతి, రాష్ట్ర కన్వీనర్, రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యదర్శి ప్రొఫెసర్ వై.నజీర్ అహ్మద్, ప్రొఫెసర్ శంకర్ కడపలోని కేఓఆర్‌ఎం ఇంజనీరింగ్ కళాశాల, అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న పరీక్షలను తనిఖీ చేశారు.