మేషం
ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. చేపట్టిన పనులు కొంత నెమ్మదిస్తాయి. ఆర్థిక పరిస్థితి నిరాశ పరుస్తుంది. ఉద్యోగాలలో చికాకులు తప్పవు. సంతాన అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపార లావాదేవీలు అంతంత మాత్రంగా సాగుతాయి.
వృషభం
ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. ముఖ్యమైన పనులు శ్రమాధిక్యంతో పూర్తి చేస్తారు ఇంటాబయట ఒత్తిడులు పెరుగుతాయి. నిరుద్యోగుల కష్టం వృధాగా మిగులుతుంది సోదరులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.
మిధునం
చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుతుంది. వాహనయోగం. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు కలుగుతాయి. స్థిరస్తి క్రయ విక్రయాలలో పురోగతి కలుగుతుంది.
కర్కాటకం
కుటుంబ సభ్యులతో దైవదర్శనాలు చేసుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. వ్యాపార,ఉద్యోగాలు కొంత మందకొడిగా సాగుతాయి. కుటుంబ విషయాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి.
సింహం
నిరుద్యోగులకు నూతన ఉద్యోగాలు దక్కుతాయి. వ్యాపార వ్యవహారాలు సజావుగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో శ్రమ ఫలిస్తుంది. ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది. ఆప్తుల నుంచి వివాదాలకు సంభందించి కీలక సమాచారం అందుతుంది.
కన్య
వృత్తి వ్యాపారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఒక వ్యవహారంలో బంధువర్గంతో మాటపడవలసి వస్తుంది. దైవచింతన పెరుగుతుంది ఉద్యోగాలలో సమస్యలు చికాకు పరుస్తాయి. దూర ప్రయాణాలు రద్దు చేసుకుంటారు. చేపట్టిన పనులు ముందుకు సాగవు.
తుల
వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు వాయిదా పడతాయి. ఆస్తుల వివాదాలు వలన మానసిక సమస్యలు కలుగుతాయి. ఆర్థిక వ్యవహారాలలో వ్యయ ప్రయాసలు తప్పవు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు చేపట్టిన పనుల్లో ప్రతిష్ఠంభనలు తప్పవు. మిత్రుల వలన సమస్యలు కలుగుతాయి.
వృశ్చికం
ఉద్యోగాలలో ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. సన్నిహితుల నుండి నూతన విషయాలు తెలుస్తాయి. కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. సంఘములో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. చేపట్టిన పనులలో శ్రమ ఫలిస్తుంది.
ధనస్సు
స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. దూర ప్రాంతాల మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. ధన వ్యవహారాలలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగస్థులకు పదోన్నతులు పెరుగుతాయి విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.
మకరం
కుటుంబ వాతావరణం చికాకుగా ఉంటుంది. మిత్రులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. వ్యాపార, ఉద్యోగాలలో ఊహించని సమస్యలు ఉంటాయి.పెద్దల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. సోదరులతో స్థిరస్తి ఒప్పందాలు చేసుకుంటారు.
కుంభం
ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. భూవివాదాల పరిష్కార దిశగా సాగుతాయి. సన్నిహితుల నుంచి ధన సహాయం అందుతుంది వ్యాపారాలు మరింత విస్తరిస్తారు. ఉద్యోగాలు మరింత ఉత్సాహవంతంగా సాగుతాయి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది.
మీనం
కుటుంబ సమస్యల నుంచి అందిన సమాచారం కొంత ఊరట కలిగిస్తుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. దైవచింతన పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి సన్నిహితుల సాయం అందుతుంది.