తెలంగాణ ఐసెట్-2022 చివరి దశ కౌన్సెలింగ్ ఆన్‌లైన్ ఎంపిక ప్రక్రియ నేటితో ముగుస్తుంది. ఈరోజు చివరి రోజు కావడంతో ఆన్‌లైన్‌లో ఆప్షన్లు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి విద్యార్థులకు సూచించింది. ISET కౌన్సెలింగ్‌లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు తమ ఎంపికలను అధికారిక వెబ్‌సైట్‌లో సమర్పించవచ్చు. వీరందరికీ అక్టోబర్ 28న ప్రొవిజనల్ సీట్లు కేటాయిస్తారని.. అక్టోబర్ 29, 31 తేదీల్లో విద్యార్థులు తమకు సీట్లు వచ్చిన ఆయా కాలేజీల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. ISET ఫేజ్ 1 కౌన్సెలింగ్ ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. కౌన్సెలింగ్ యొక్క చివరి దశ పూర్తయిన తర్వాత, తెలంగాణ రాష్ట్రంలోని ప్రైవేట్ మరియు అన్ ఎయిడెడ్ కళాశాలల్లో MBA మరియు MCA ప్రోగ్రామ్‌లలో ప్రవేశాల కోసం స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తారు. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఈ ఏడాది తెలంగాణ ఐసెట్-2022 పరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే.