మేషం
ఉద్యోగమున పని ఒత్తిడి పెరిగి తగిన విశ్రాంతి లభించదు. దీర్ఘ కాలిక ఋణఒత్తిడి పెరుగుతుంది. బంధు మిత్రుల వలన కొన్ని ఊహించని సమస్యలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ప్రయాణాలలో మార్గవరోదాలు కలుగుతాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి.
వృషభం
బంధు మిత్రులతో శుభ కార్యాల్లో పాల్గొంటారు. విద్యార్థుల ఫలితాలు ఉత్సాహనిస్తాయి.
వృత్తి ఉద్యోగాలలో సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. ఆదాయమార్గాలు పెరుగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు.
మిధునం
దూరప్రాంత బంధు మిత్రుల నుండి అందిన ఒక వార్త ఆనందం కలిగిస్తుంది. వృత్తి వ్యాపార పరంగా మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. చేపట్టిన వ్యవహారాలలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తిచేస్తారు. దూర ప్రయాణ సూచనలున్నవి.
కర్కాటకం
స్థిరాస్తి సంబంధిత ఒప్పందాలలో ఆటంకాలు కలుగుతాయి. ఉద్యోగమున అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆర్థిక వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. చేపట్టిన పనులల్లో శ్రమాధిక్యత పెరుగుతుంది. వ్యాపార పరంగా ఆశించిన లాభలు అందుకుంటారు.
సింహం
దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు మరింత చికాకు కలిగిస్తాయి. దూరప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నవి. చేపట్టిన వ్యవహారాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. సోదరులతో స్ధిరాస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. ముఖ్యమైన పనులలో ఒడిదుడుకులు తప్పవు.
కన్య
నిరుద్యోగులుకు అరుదైన అవకాశములు లభిస్తాయి. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. జీవిత భాగస్వామి నుండి ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి. నూతన వస్తు వాహనాలు కొనుగోలుచేస్తారు. దూరపు బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలు సంతృప్తి కరంగా సాగుతాయి.
తుల
స్థిరాస్తి వివాదాలు రాజీ అవుతాయి. భూ సంబంధిత క్రయ విక్రయాలలో లాభలు అందుకుంటారు. ఇంటా బయట అందరితో సఖ్యతగా వ్యవహరిస్తారు. శత్రు సమస్యలు నుండి ఉపశమనం పొందుతారు. చిన్ననాటి మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది.
వృశ్చికం
చేపట్టిన పనులలో శ్రమ తప్ప ఫలితం ఉండదు. కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు. పెద్దల ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. ముఖ్యమైన పనులు వాయిదా పడుతాయి. ఇతరుల విషయాలలో తొందరపడి మాట ఇవ్వటం మంచిది కాదు. వృత్తి ఉద్యోగాలలో చిన్నపాటి వివాదాలు తప్పవు.
ధనస్సు
బంధుమిత్రుల నుండి వ్యతిరేకత పెరుగుతుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులు మరింత కష్టపడవలసి వస్తుంది. గృహమున కొన్ని పరిస్థితులు చికాకు పరుస్తాయి. చేపట్టిన పనులలో వ్యయప్రయాసలు అధికమౌతాయి. సంతానం విద్యా విషయాల పై దృష్టి సారించడం మంచిది.
మకరం
వృత్తి వ్యాపారాలలో సమస్యలను తెలివిగా పరిష్కరించి లాభాలను అందుకుంటారు. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. చేపట్టిన వ్యవహారాలలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగాలలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి.
కుంభం
కుటుంబ సభ్యులతో వివాదాలు కలుగుతాయి. నేత్ర సంభందిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపార ఆలోచనలలో స్థిరత్వం ఉండదు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.
మీనం
విలువైన గృహోప కరణాలు కొనుగోలు చేస్తారు. స్ధిరాస్తి క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు. వృత్తి వ్యాపారాలు లాభాల బాట పడతాయి. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయులతో కీలక విషయాల గురించి చర్చిస్తారు. ధనదాయం పెరుగుతుంది. ఉద్యోగాలలో నూతన హోదాలు పొందుతారు.