దేశంలో చిన్నారులకు స్కూళ్లలో వేసవిలో సెలవులు ఇవ్వడం అందరికీ తెలుసు. అయితే జమ్మూ కాశ్మీర్‌లో స్కూలు చిన్నారులకు అక్కడి ప్రభుత్వం 3 నెలలు శీతాకాల సెలవులను శుక్రవారం ప్రకటించింది. వినడానికి ఆశ్చర్యం అనిపించినా ఇది నిజం. నర్సరీ నుంచి 5వ తరగతి వరకు చదివే చిన్నారులకు డిసెంబర్ 1 నుంచి సెలవులు ప్రకటించారు. 6 నుంచి 8వ తరగతి విద్యార్థులకు డిసెంబర్ 12 నుంచి సెలవులు ప్రకటించారు. పాఠశాలలు తిరిగి ఫిబ్రవరి 28వ తేదీ నుంచి పునః ప్రారంభం అవుతాయి. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో మంచు అధికంగా కురుస్తుండడంతో ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది.